కరోనా వైరస్ పై పోరాటంలో మొదటి నుండి దూకుడుగా ఉన్న కేరళ క్రమంగా వైరస్ ను కట్టడి చేయగలిగింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇంటర్ విద్యార్థుల పరీక్షలు నిర్వహిస్తోంది. విద్యార్థులు మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఓ విద్యార్థిని పరీక్షల కేంద్రానికి వెళ్లేందుకు సదుపాయాలు లేక ఇబ్బంది పడుతుందని తెలిసి ప్రభుత్వ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఒక్క విద్యార్థిని కోసం 70 సీట్ల పడవను నడిపే ఏర్పాట్లు చేసారు. డ్రైవర్‌తో పాటు ఆమెకు తోడుగా నావిగేటర్, బోట్ మాస్టర్, ఇద్దరు సహాయకులను నియమించారు. వివరాల్లోకి వెళ్తే కేరళలోని అలప్పూజ జిల్లా ఎమ్ఎన్ బ్లాక్ ప్రాంతానికి చెందిన సాండ్రా అనే ఓ 17 ఏళ్ల అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం, శనివారం జరిగిన పరీక్షల కోసం సాండ్రాను ఎమ్ఎన్ బ్లాక్ నుంచి కొట్టాయంలోని కంజిరామ్ వరకు తీసుకెళ్లారు. సాధారణంగా ఈ పడవను సింగిల్ ట్రిప్ నడిపేందుకు రూ.4 వేలు వసూలు చేసే అధికారులు ఆమె నుంచి ట్రిప్పుకు రూ.9 చొప్పున వసూలు చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa