ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో దారుణం...మద్యం తాగించి భార్య పై

national |  Suryaa Desk  | Published : Sat, Jun 06, 2020, 10:51 AM

సమాజంలో వావివరసలు లేకుండా పోతున్నాయి. రోజురోజుకూ సొంతవారిపైనే అయినవాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. సొంత కూతురిపై తండ్రి అత్యాచారం, సోదరిపై సోదరుడు అత్యాచారం, చిన్నారిపై వృద్ధుల అత్యాచారం ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇంకాస్త ముందుకు వెళితే డబ్బుల కోసమో మరొకదానికోసమో సొంత భార్యతోనే వ్యభిచారం చేయిస్తున్న దుర్మార్గులకు సంబంధించిన వార్తలు కూడా చదువుతున్నాం. తాజాగా కేరళలో కూడా ఓ ఇల్లాలిపై సొంత భర్తే తన స్నేహితులతో కలిసి అత్యాచారంకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

కేరళలో దారుణం చోటుచేసుకుంది. 25 ఏళ్ల వివాహితపై సొంత భర్తే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.తన స్నేహితులతో కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించి ఆపై సామూహిక అత్యాచారంకు పాల్పడ్డారు. ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టించింది. అంతకంటే దారుణమైన విషయమేమిటంటే ఐదేళ్ల కొడుకు ముందే ఆ ఇల్లాలిపై సామూహిక అత్యాచారం చేయించాడు దుర్మార్గపు భర్త. ఆ ఇల్లాలిపై అత్యాచారం చేస్తున్న సమయంలో అడ్డుపడ్డ కొడుకును చితకబాదారు. తల్లిని కాపాడుకుందామని అడ్డుపడ్డ ఆ పసిబిడ్డకు గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన భర్తతో పాటు అతని నలుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు.

విషయం తెలుసుకున్న కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా కేసును రిజిస్టర్ చేసింది. ఇక అసలు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది బాధిత మహిళ. తన భర్త మాయమాటలు చెప్పి తనను తమ ఇద్దరి పిల్లలను పుతుకురిచ్చి బీచ్‌కు గురువారం తీసుకెళ్లినట్లు చెప్పింది. అక్కడి నుంచి తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లినట్లు చెప్పింది. అక్కడే బలవంతంగా మద్యం సేవించి లైంగికంగా వేధించినట్లు వెల్లడించింది. ఇదంతా తన ఐదేళ్ల కొడుకు ముందే జరిగిందని వివరించింది. ఇక అత్యాచారం చేసిన తర్వాత ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకున్న ఈ మహిళ పరుగులు తీస్తూ ఓ రోడ్డుపై పడిపోయింది. బలవంతంగా మద్యం తాగించినందున మత్తులో రోడ్డుపై పడిఉన్న మహిళను చూసిన ఓ వ్యక్తి తన కారులో ఇంటికి తీసుకెళ్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు

ఇక అత్యాచార బాధితురాలిని కాపాడిన ఆ వ్యక్తి స్థానిక మీడియాతో మాట్లాడాడు. ఆ మహిళను తాను చూసినప్పుడు మైకంలో ఉందని ఏడుస్తోందని చెప్పాడు. ఆమె ముఖంపై గాయాలు ఉన్నట్లు తాను గమనించినట్లు చెప్పిన వ్యక్తి సహాయం చేయాల్సిందిగా అర్థించిందని చెప్పాడు. కడినకుళం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలిని అడ్మిట్ చేయగా చికిత్స అనంతరం ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఆమె శరీరంపై సిగరెట్‌తో కాల్చారని బాధితురాలు పేర్కొంది.

SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa