అమ్మాయిల వివాహ వయస్సును పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అమ్మాయిలకు తక్కువ వయస్సులో వివాహాలు చేయడం ద్వారా శిశుమరణాలు, తల్లి మరణాలు జరుగుతున్నాయని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. ఈ అంశంపై 10 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు. వివాహ వయస్సు పెరిగితే సంతాన సాఫల్య రేటు, స్త్రీ-పురుష నిష్పత్తి తదితర అంశాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్‌ను కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం అమ్మాయిల వివాహ వయస్సు 18 ఉండగా దానిని 21 సంవత్సరాలు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa