అనంతపురం జిల్లాలో పట్టుబడ్డ బీఎస్-3 వాహనాలపై విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ప్రసాదరావు మాట్లాడుతూ అశోక్ లేలాండ్ స్క్రాప్ కింద అమ్మిన బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. స్క్రాప్ కింద కొన్న 154 వాహనాల్లో 101 వాహనాలు ఏపీలోనే ఉన్నాయని... 54 వాహనాలు నాగాలాండ్ నుంచి తీసుకొచ్చి ఎన్ఓసి తీసుకొని ఏపీలో తిప్పుతున్నారని ప్రసాదరావు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa