ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి రాశి ఫలితాలు(09-06-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 09, 2020, 01:41 PM

రాశి- మేషం: సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది. కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి. మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహపూర్వకంగా మెలగడం మంచిది.


రాశి- వృషభం: ఒక సమాచారం కలవరపెడుతుంది. ఆర్థికపరమైన సమావేశాలు ఫలించకపోవచ్చు. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. నూతన ఒప్పందాలు చేస్తారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణాల్లో నిదానం అవసరం.


రాశి- మిధునం: ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.


రాశి- కర్కాటకం: రావలసిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.


రాశి- సింహం: ప్రయత్న అనుకూలత ఉంది. మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. అనుకున్న ఫలితాలు సొంతమవుతాయి.


రాశి- కన్య: లక్ష్యాన్ని చేరుకునేవరకు పట్టు వదలకండి. రావలసిన బకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.


రాశి- తుల: నూతన వస్తువులు కొంటారు. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది. ఇబ్బందికర సంఘటనలు ఉన్నాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.


రాశి- వృశ్చికం: సమయానికి ఆహారనియమాలను పాటించాలి. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను, ఆత్మీయులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు.


రాశి-ధనస్సు: ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.


రాశి- మకరం: పనుల్లో జాప్యం. అనుకోని మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది.


రాశి- కుంభం: ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగవిషయంలోవిదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


రాశి- మీనం :ముఖ్యమైన పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa