ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మసీదు అపవిత్రమవుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 12:35 PM

ఆల్కహాల్‌తో తయారు చేయబడ్డ శానిటైజర్‌తో మసీదును శుభ్రం చేయొద్దని.. అలా చేస్తే అది అపవిత్రమవుతుందని ఆల్‌ ఇండియా తాంజీమ్‌ ఉలమా ఈ ఇస్లాం జనరల్‌ సెక్రటరీ మౌలనా షాహబుద్దీన్‌ పేర్కొన్నారు. పవిత్రమైన మసీదును ఆల్కహాల్‌ శానిటైజర్‌తో శుద్ధి చేయొద్దని అన్ని మసీదులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. శానిటైజర్‌తో కాకుండా డిటర్జెంట్లు, ఇతర మార్గాలను ఉపయోగించి మసీదులను శుభ్రపరచాలని సూచించారు. ఇస్లాంలో మద్యం నిషేధించబడినందున డిటర్జెంట్లు, షాంపూలు, కొన్ని రసాయనాల వంటి ఉత్పత్తులను ఉపయోగించి మసీదులను శుభ్రం చేయాలన్నారు. ఒక వేళ శానిటైజర్‌ను ఉపయోగించే శుద్ధి చేస్తే మసీదు అపవిత్రమవుతుందన్నారు. దేవుణ్ణి అపవిత్రం చేయలేమని షాహబుద్దీన్‌ పేర్కొన్నారు. తెలిసి తెలిసి మసీదును అపవిత్రం చేస్తే పాపం అవుతుందన్నారు. మసీదులకు వచ్చే వారందరూ కరోనా వైరస్‌ నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని షాహబుద్దీన్‌ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa