చాలామంది ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ తాగకపోతే ప్రాణం లేవదని అంటుంటారు. అయితే, వైద్య నిపుణుల ప్రకారం పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, ఛాతీలో మంట, కడుపులో అసౌకర్యం వంటివి తలెత్తుతాయి. దీర్ఘకాలంలో కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. టీలోని కెఫీన్ మూత్రవిసర్జనను ప్రేరేపించడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై, అలసట, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉదయాన్నే టీకి బదులుగా గోరువెచ్చని నీరు తాగడం ఉత్తమమని, ఒకవేళ టీ తాగాలనుకుంటే అల్పాహారం తర్వాత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa