ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్‌డౌన్‌ పై స్పష్టతనిచ్చిన సీఎం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 02:16 PM

మహారాష్ట్రలో మరోసారి లాక్‌డౌన్‌ను విధించబోమని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. అయితే ప్రజలు భౌతిక దూరంతోపాటు ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం శుక్రవారం ట్వీట్‌ చేసింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య లక్షకు చేరుతుండటంతో రాష్ట్రంలో మరోసారి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధిస్తారంటూ ఇటీవల వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే దీనిపై స్పష్టత ఇచ్చారు. సడలించిన లాక్‌డౌన్‌ను తిరిగి పునరుద్ధరింబోమని చెప్పారు. అయితే ప్రజలంతా భౌతిక దూరంతోపాటు కరోనా వ్యాప్తి నియంత్రణ మార్గదర్శకాలను పాటించాలన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa