కాపాడాల్సన కానిస్టేబులే ఓ మహిళపై హాత్యాచారానికి యత్నించాడు. అప్పుగా తీసుకున్న పైసలు ఇస్తానంటూ పిలిచి స్నేహితుడితో కలిసి అఘాయిత్యానికి యత్నించాడు. చాకచక్యంగా తప్పించుకుకన్న బాధితురాలు కీచక కానిస్టేబుల్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషాదకర ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. వెంకటరాజేష్ అనే కానిస్టేబుల్ ఒంగోలులోని ఓ పోలీసు స్టేషన్‌లో రైటర్‌గా పని చేస్తున్నాడు. సదరు కానిస్టేబుల్‌కు ఒంగోలు దిబ్బలరోడ్డుకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మహిళ నుంచి వెంకటరాజేష్ రూ.35 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఆ సమయంలో నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు. తీరా తీసుకున్న డబ్బులు చెల్లించాలని కోరితే నగ్న చిత్రాలు చూపించి బెదిరింపులకు దిగాడు. ఈనెల 8న అప్పు తిరిగి చెల్లిస్తానని తన స్నేహితుడైన విశ్రాంత సైనిక ఉద్యోగి నల్లూరి సుధాకర్ అనే వ్యక్తి ఇంటికి మహిళను పిలిపించాడు. అక్కడికి వచ్చిన మహిళపై అత్యాచారం చేసేలా సుధాకర్‌ను ఉసిగొల్పాడు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుంది. అయినా వదిలేయకుండా సుధాకర్, మరో స్నేహితుడు దొంగా హరిలు మహిళను బెదిరించారు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa