ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దగ్గుతో బాధపడుతున్నారా?... అయితే?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 12, 2020, 04:04 PM

కరోనా మహమ్మారి గట్టిగా దగ్గినా, తుమ్మినా అనుమానించి క్వారంటైన్ కు తరలిస్తున్నారు. సీజన్ల మార్పులో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, తుమ్ములను ఒకప్పుడు పెద్దగా పట్టించుకోకపోయినా.. ఇప్పుడు మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ముఖ్యంగా దగ్గు ఒకసారి వచ్చిందంటే.. దాన్ని నివారించడం చాలా కష్టం. అయితే, ఇంట్లోనే మనం దగ్గుకు మందు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.


తెనె - పసుపు: పసుపులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఎక్కువ. పసుపులో ఉండే కార్టూమన్స్ దగ్గు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దగ్గు బాగా వేధిస్తుంటే కొద్దిగా పసుపు, కాస్త తేనె కలిపిన మిశ్రమాన్ని తాగండి.


తేనె, సొంటి పౌడర్: సొంటి పౌడర్, తేనె మిశ్రమాన్ని నిత్యం తీసుకుంటే పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.


మిరియాల పొడి, గోరు వెచ్చని పాలు: గోరు వెచ్చని పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేయండి. దీనివల్ల దగ్గు నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు.


అల్లం టీ: అల్లం టీని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో వేయండి. ఆ తర్వాత నీటిని బాగా మరిగించండి. దీనివల్ల అల్లంలో ఉండే ఔషదాలన్నీ నీటిలో కలుస్తాయి. ఈ అల్లం టీని రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఉప్పు నీరు: కఫం దగ్గుతో బాధపడుతున్నట్లయితే గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపండి. ఆ నీటిని నోటిలో వేసుకుని బాగా పుకిలించండి. దీనివల్ల గొంతులో ఉండే శ్లేష్మం (కఫం) బయటకు వచ్చేస్తుంది. కఫం దగ్గు వేధిస్తుంటే.. గ్లాసుడు నీటిలో ఉప్పు వేసి కలపండి. ఆ నీటిని నోటిలో వేసుకుని పుకిలించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa