ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ లక్షణం ఉన్నా కరోనా ఉన్నట్లేనా ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 13, 2020, 09:25 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ తన రూపు మార్చుకుంటోంది. ఇన్నాళ్లు జలుబు, జ్వరం, దగ్గు మాత్రమే కరోనా లక్షణాలు అని అందరూ భావించారు. కానీ కొందరిలో ఏ లక్షణాలు లేకున్నా వారికి కరోనా సోకినట్లు కరోనా తేలినట్లు తేలుతోంది. దీంతో కోవిడ్‌-19 టెస్టింగ్‌కు రోగుల్లో కనిపించే లక్షణాల జాబితాలో మరో రెండింటిని చేర్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. అనూహ్యంగా రుచి కోల్పోవడం, వాసనను పసిగట్టలేకపోవడం పలు కరోనా రోగుల్లో కనిపిస్తున్నందున వీటినీ కరోనా లక్షణాల్లో చేర్చాలని గతవారం కోవిడ్‌-19పై ఏర్పాటైన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో చర్చకు వచ్చింది. కానీ ఇంకా ఈ అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కానీ త్వరలోనే ఆ కొత్త లక్షణాన్ని కరోనా జాబితా లక్షణాల్లో చేర్చే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa