ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయడు గుంటూరు ఆసుపత్రిలో ఉన్నారు. గుంటూరులోని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు చిన్న ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు... చికిత్స నిమిత్తం తొలుత ఆసుపత్రికి తరలించాలంటూ ఏసీబీ అధికారులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో, అచ్చెన్నాయుడుని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు యత్నించారు. అయితే, పరామర్శపై ఆయన చేసుకున్న అభ్యర్థనను జైళ్ల శాఖ అధికారులు నిరాకరించారు. కరోనా నిబంధనల నేపథ్యంలో, పరామర్శకు అనుమతిని ఇవ్వలేమని చెప్పారు. గత 2 నెలలుగా ఎవరీకీ అనుమతి ఇవ్వలేదని... ఇప్పుడు చంద్రబాబుకు కూడా ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇదే అంశంపై జీజీహెచ్ సూపరింటెండెంట్ స్పందిస్తూ... మేజిస్ట్రేట్ అనుమతిని చంద్రబాబు తీసుకోవాలని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa