ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధోనీ ఓ లెజెండ్ : రోహిత్‌ శర్మ

national |  Suryaa Desk  | Published : Mon, Jun 15, 2020, 09:58 AM

టీమిండియా స్టార్‌ ఓపెనర్, హిట్‌మ్యాన్‌‌ రోహిత్‌ శర్మ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ‌2020తో పాటు 2020 టీ20 ప్రపంచకప్‌ కూడా జరగాలని ఆశిస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఈ టోర్నీలపై ఇప్పటికీ స్పష్టత లేకుండాపోయింది. ఎప్పుడు నిర్వహించాలో ఇటు బీసీసీఐ అటు ఐసీసీకి అర్ధం కావడం లేదు. అయితే టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్ మాత్రం తాను ఈ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు.


ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ జెసన్‌ రాయ్‌ల ఆటను చూడటాన్ని ఆస్వాదిస్తున్నానని రోహిత్‌ తెలిపాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చెబుతారనే ప్రశ్నకు రోహిత్‌ బదులిస్తూ.. ‘లెజెండ్‌' అని ముక్తాయించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గురించి ఒక్క మాటలో చెప్పమని కోరగా.. స్టార్ ఓపెనర్‌ తనదైన శైలిలో జవాబిచ్చాడు. దీంతో అభిమాని బిత్తరపోయాడు. ఇంతకు ఆ అభిమాని ఏమడిగాడంటే... 'Virat Kholi గురించి ఒక్క మాటలో చెప్పండి' అని అడగ్గా.. 'స్పెల్లింగ్‌ చెక్‌ చేస్కో' అని రోహిత్ పంచ్ వేసాడు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa