ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 10:57 AM

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి సమావేశం కానున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మోదీ ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. మంగళ, బుధవారాల్లో ఆయన సీఎంలతో చర్చించనున్నారు. 


మంగళవారం మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 21 రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లతో మోదీ భేటీ అవుతారు. బుధవారం మరో 15 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల వారితో సమావేశం అవుతారు. ఇందులో అత్యధికంగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, కర్ణాటక, గుజరాత్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ఉన్నాయి. ప్రధాని మోదీ సీఎంలతో సమీక్ష నిర్వహించడం ఇది ఆరోసారి. చివరి సారిగా మే 11న ఆయన ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa