కృష్ణా జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట (మ) వేదాద్రి వద్ద ట్రాక్టర్, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటన సమయంలో ట్రాక్టర్ లో 20 మంది ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు. మృతులంతా ఖమ్మం జిల్లా మధిర వాసులని పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఇతర అధికారులు అక్కడికి చేరుకుని సహాయచర్యలకు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa