త్రిపుర రాష్ట్రానికి చెందిన అండర్ 19 మహిళా క్రికెటర్ అయంతి రీయాంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. అయంతి వయస్సు 16 సంవత్సరాలు. అయంతి రీయాంగ్ తెగకు చెందిన యువతి. ఈమె స్వగ్రామం ఉదయపూర్ లోని తెనాని గ్రామం. ఈ గ్రామం అగర్తలా నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయంతి నలుగురు తోబుట్టువుల్లో చిన్న అమ్మాయి.మంగళవారం రాత్రి అయంతి తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయంతి గత ఏడాది కాలంగా త్రిపుర అండర్ -19 మహిళా జట్టులో సభ్యురాలుగా కొనసాగుతోంది. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి తిమురా చందా మాట్లాడుతూ రాష్ట్రం ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిని కోల్పోయిందన్నారు. అయంతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa