ఉపాధి దొరక్క సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చేసిన కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రూ.50వేల కోట్లతో వారికి ఉపాధి కల్పించేందుకు ఓ పథకాన్ని ప్రారంభించనుంది. గరీబ్ కళ్యాన్ రోజ్‌గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. వలస కార్మికులు భారీగా తిరిగి వచ్చిన 116 జిల్లాలను కేంద్రం గుర్తించింది. ఆ జిల్లాల్లో మొదటగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. దీనివల్ల మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కార్మికులు లబ్ధిపొందనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి బీహార్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఎంపికైనట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa