ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా టీవీని పగలగొట్టి నిరసన

national |  Suryaa Desk  | Published : Fri, Jun 19, 2020, 05:10 PM

భారత్, చైనా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాలో తయారైన కంపెనీ టీవీని పగులగొట్టి ప్రజలు తమ నిరసనను తెలిపారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన జరిగింది. సూరత్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యక్తి తమ ఇంట్లో ఉన్న ఖరీదైన 42 అంగుళాల టీవీని రెండో అంతస్తు నుంచి కిందపడేశాడు. అనంతరం ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే మరికొందరు కూడా కలసి ఆ టీవీని పగలగొట్టారు. అనంతరం చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa