భారత్-చైనా సరిహద్దులో గాల్వాన్ లోయ వద్ధ ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన బీకర ఘర్షణలో చైనాకు ఎంత నష్టం జరిగిందనేది ఇప్పటికీ గోప్యమే. ఇప్పటి వరకు చైనా సైనికుల మరణాలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ ఘర్షణలో చైనాకు సంబంధించి 35 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు స్పష్టం చేశారు. ఇకపోతే జాతీయ మీడియా అయితే 45 మంది వరకు చనిపోయారంటూ ప్రచారం చేసింది. కానీ చైనా మాత్రం నోరు మెుదపలేదు. ఈ విషయాన్ని ఇప్పట్లో బయటపెట్టదని కథనాలు కూడా వచ్చాయి. అయితే సోషల్ మీడియా మాత్రం ఏ నిజాన్ని దాచడం లేదు. ప్రపంచంలో ఏమూలన ఏది జరిగినా అది ఇట్టే మోసుకొస్తోంది సోషల్ మీడియా.చైనా ట్విట్టర్‌లో గాల్వాన్ ఘటనకు సంబంధించి తొలి ఆధారం వైరల్ అవుతోంది. ఆ ఘర్షణలో మృతి చెందిన ఓ చైనా సైనికుడి సమాధికి చెందిన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఆ సమాధిపై ఇది చెన్ చియాంగ్రో సమాధి. భారత్‌తో గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో ఆయన ప్రాణ త్యాగం చేశారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ చెన్ త్యాగాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది అని శిలాఫలకంపై రాసి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ శిలాఫలకం చైనా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రాలు భారత ట్విట్టర్‌లోనూ హల్‌చల్ చేస్తున్నాయి.అమరులైన భారత్ జవాన్లకు సకల ప్రభుత్వ లాంఛనాల మధ్య దేశ ప్రజలు తుది వీడ్కోలు పలకింది. కానీ చైనా మాత్రం అత్యంత గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించింది. ఈ అంశంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా సైతం తీవ్ర విమర్శలు చేసినప్పటికీ ప్రభుత్వం అసలు స్పందించలేదు. ఇప్పటికీ జరిగిన నష్టం తాలూకు వివరాలు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో తాజా చిత్రాలు అక్కడి రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి. ఇకపోతే ఈ బీకర ఘర్షణలో భారత్ ఆర్మీ చైనా పై సింహాల్లా గర్జించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa