భీమ్-యూపీఐ, రూపే, యూపీఐ క్యూఆర్ కోడ్ డిజిటల్ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కస్టమర్ల నుంచి వసూలు చేసిన చార్జీలను తిరిగి వారికి చెల్లించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బ్యాంకులను ఆదేశించినట్లు నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.ఈ ఏడాది జనవరి 1 నుంచి వసూలు చేసిన చార్జీలన్నీ తిరిగి ఇచ్చేయాల్సిందేనని ఆదివారం కేంద్రం సర్యులర్ జారీచేసింది.ఈ డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని తేల్చిచెప్పింది.
డిజిటల్ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2019లో ఫైనాన్స్ యాక్ట్-2019లో సెక్షన్ 269ఎస్‌యూను చేర్చింది. భీమ్-యూపీఐ, రూపే- డెబిట్‌కార్డ్, యూపీఐ క్యూఆర్ కోడ్ లావాదేవీలను ఈ సెక్షన్ కింద నోటిఫై చేసింది. దాంతో ఈ మార్గాల్లో చేసే చెల్లింపులకు చార్జీలు వసూలు చేయరాదు. కానీ కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటంతో సీబీడీటీ తాజా సర్క్యులర్‌ను జారీచేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa