కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా అచల్ కుమార్ జ్యోతి ఎంపికయ్యారు. కేంద్ర న్యాయశాఖ ఆయన నియామకాన్ని ఖరారు చేసింది. ఈ నెల 6 న అచల్ కుమార్ సీఈసీ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి నసీమ్ జైదీ ఈ నెల 6 న పదవీ విరమణ చేయనున్నారు. 64 ఏళ్ల అచల్ కుమార్ గుజరాత్ ఐఏఎస్ కేడర్ అధికారి. గుజరాత్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. 2013 లో ఆయన రిటైర్ అయ్యారు. ఆ తర్వాత గుజరాత్ విజిలెన్స్ అధికారిగా బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా అచల్ కుమార్ మూడేళ్ల పాటు అధికారంలో ఉంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa