నేచురల్ స్టార్ నాని డబుల్ హ్యట్రిక్ సాధించి మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం మరో హిట్ పై కన్నేసాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని నిన్ను కోరి అనే చిత్రాన్ని చేయగా ఈ మూవీ జులై 7న విడుదల కానుంది. నివేదా థామస్ ఈ చిత్రంలో నాయికగా నటించగా, ఆదిపినిశెట్టి ముఖ్య పాత్ర పోషించాడు. మరో రెండు రోజుల్లో నిన్ను కోరి మూవీ విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ వెరైటీ ప్రమోషన్స్ తో సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్ , సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుందనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. ఓవర్సీస్ లోను నాని కి మంచి క్రేజ్ ఉండడంతో అమెరికాలో భారీ సంఖ్యలో థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ చిత్ర టీం తాజాగా మెన్నిక్విన్ ఛాలెంజ్ (బొమ్మలా నిలుచోడం) వీడియోని రూపొందించి నెట్ లో విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రంకి గోపి సుందర్ సంగీతం అందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa