ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ నిన్న టెల్ అవీవ్ చేరుకున్న విషయం తెలిసిందే. తనకు ఘన స్వాగతం పలికిన సందర్భంగా కృతఙ్ఞతలు చెప్పే నిమిత్తంఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు రూవెన్ రివ్లిన్ ని మోదీ లాంఛనప్రాయంగా ఈ రోజు కలిశారు. తనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న రూవెన్ తో ‘ఐ ఫర్ ఐ, ఇండియా కోసం ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కోసం ఇండియా’ అని మోదీ అన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన మోదీ, ఓ ఫొటోనూ జత చేశారు. ‘ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రొటోకాల్ ను పక్కనపెట్టి మరీ, నాకు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు. భారతీయులకు ఎంతటి గౌరవం లభించిందనడానికి ఇదే నిదర్శనం’ అని ఆ ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa