మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరో హెలికాప్టర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఈ మధ్యాహ్నం ఈ ప్రమాదం సంభవించింది. ఫడ్నవీస్ హెలికాప్టర్ లోకి ఎక్కడానికి సిద్ధమవుతున్న సమయంలో... హెలికాప్టర్ పైకి లేవబోయింది. అప్పటికే హెలికాప్టర్ ఇంజిన్లను పైలట్ ఆన్ చేసి ఉండటంతో ఈ ఘటన సంభవించింది. అయితే, ఎలాంటి ప్రమాదం జరగకుండానే ఫడ్నవిస్ క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఈ కథనాలన్నీ అబద్ధమేనని... ఎలాంటి ప్రమాదం సంభవించలేదని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. మే 25వ తేదీన కూడా ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి కూడా ఆయన క్షేమంగా బయటపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa