విజయవాడలోని కొన్ని హోటళ్లు అపరిశుభ్రతకు, నాణ్యతలేని ఆహార పదార్థాలకు నిలయంగా మారాయి. వీటిలో ప్రముఖ హోటళ్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే తింటున్న టిఫిన్ లోనే పురుగులు రావడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు నగరంలోని గ్రాండ్ మినర్వాలో టిఫిన్ చేస్తుండగా అందులో పురుగులు ఉండటాన్ని ఆయన గమనించారు. ఒక క్షణం విస్తుపోయిన ఆయన ఆ తర్వాత ఆ విషయాన్ని హోటల్ యాజమాన్యానికి తెలిపారు. అయినా, వారు పట్టించుకోకపోవడంతో చివరకు ఆహార నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa