గత ఏప్రిల్ నెలలో ట్రాయ్ ఆదేశాల మేరకు జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను ఉపసంహరించుకుని దాని స్థానంలో ధన్ ధనా ధన్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆ ఆఫర్ ప్రకారం రీచార్జి చేసుకున్న వారికి గడువు ఈ నెలలో ముగియనుంది. దీంతో జియో ఆ యూజర్ల కోసం కొత్త ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. దీంతోపాటు పలు పాత ప్లాన్లను కూడా సవరించింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రూ.19 ప్లాన్ - 1 రోజు వాలిడిటీ, 200 ఎంబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.49 ప్లాన్ - 3 రోజుల వాలిడిటీ, 600 ఎంబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.96 ప్లాన్ - 7 రోజుల వాలిడిటీ, రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.149 ప్లాన్ - 28 రోజుల వాలిడిటీ, 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్లు
రూ.309 ప్లాన్ - 56 రోజుల వాలిడిటీ, రోజుకు 1 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.349 ప్లాన్ - 56 రోజుల వాలిడిటీ, 20 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.399 ప్లాన్ - 84 రోజుల వాలిడిటీ, రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.509 ప్లాన్ - 56 రోజుల వాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.999 ప్లాన్ - 90 రోజుల వాలిడిటీ, 90 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.1999 ప్లాన్ - 120 రోజుల వాలిడిటీ, 155 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.4999 ప్లాన్ - 210 రోజుల వాలిడిటీ, 380 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్లు
రూ.9999 ప్లాన్ - 390 రోజుల వాలిడిటీ, 780 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు
పైన చెప్పిన ప్లాన్లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండింటిలోనూ యూజర్లకు లభిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa