ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు విద్యాశాఖ గతంలో ఉన్న పాఠశాలల సమయాల్లో మార్పులు చేసింది. ప్రాథమిక పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని విద్యాశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, ఆ సమయంలో పిల్లలు ఆయా అంశాలను త్వరితంగా, లోతుగా అవగాహన చేసుకోగలుగుతారని సీఎం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa