అమరావతి : ఎపి లో నేటి నుండి మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 8 న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువుంది. ఇప్పటికే రెండు విడతల పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 9 వ తేదీన తొలివిడత, ఈనెల 13 వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మూడోవిడత ఈనెల 17 వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అదేరోజున ఫలితాలు వెల్లడికానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa