మహారాష్ర్టలోని పాన్వెల్ రైల్వే స్టేషన్‌లో ఓ రైలు వేగంగా కదులుతోంది. ఆ రైలును ఎక్కేందుకు అక్కడ ఉన్న ఓ దివ్యాంగుడు ప్రయత్నించాడు. కానీ అతని కాలు జారడంతో ఎక్కలేకపోయాడు. ఫ్లాట్‌ఫాం - రైలు మధ్య దివ్యాంగుడు పడిపోతున్న క్రమంలో అక్కడే విధుల్లో ఉన్న రైల్వే పోలీసు అప్రమత్తమై అతన్ని ప్రాణాలతో కాపాడాడు. తర్వాత దివ్యాంగుడిని పోలీసులు చేరదీశారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం సమయంలో చోటు చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa