ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఓ గ్రామంలో వైసీపీ, టీడీపీ వర్గాలు గ్రామం కోసం చేతులు కలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పంచాయతీలో సర్పంచ్ పదవిని వైసీపీ, టీడీపీలు పంచుకున్నాయి. 3 ఏళ్ల పాటు వైసీపీ మద్దతుదారుడు, 2 ఏళ్ల పాటు టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్ గా ఉండేలా ఒప్పంద పత్రాలపై నేతలు సంతకం చేశారు. ఇది హోంమంత్రి సుచరిత నియోజకవర్గం కావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ, ప్రజలు ఈ ఒప్పందాన్ని హర్షిస్తున్నారు. ఇలాంటి వాటివల్ల గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa