భారతీయ పురావస్తు శాఖ తవ్వకాల్లో వేల వందల ఏళ్ల క్రితం నాటి జైన మత దేవాలయం బయటపడింది. జనవరి 20న ఈ తవ్వకాలను ప్రారంభించగా, దేవాలయం రూపురేఖలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. భారతీయ పురావస్తు శాఖ అధికారులు చరిత్రాత్మక ఘట్టానికి నాంది పలికారు. 11వ శతాబ్దంలో నిర్మించినదిగా భావిస్తున్న ఓ జైన మత దేవాలయాన్ని కనుగొన్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలోని హలేబిడ్ ప్రాంతంలో ఈ దేవాలయం బయటపడింది. జనవరి 20న ఇక్కడ జైన్ దేవాయలం ఉన్నట్టు గుర్తించి అధికారులు తవ్వకాలు చేపట్టారు. భారతీయ పురావస్తు శాఖ అధికారులు చేపట్టిన ఈ తవ్వకాల్లో హోసల రాజుల కాలానికి సంబంధించిన జైన దేవాలయం బయటపడింది. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలను హోసల రాజులు పాలించారు. ఈ తవ్వకాలను భారతీయ పురావస్తు శాఖ రీజనల్ దక్షిణాది రీజనల్ డైరెక్టర్ జీ మహేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు. బెంగళూరు సర్కిల్ సూపరిండెంట్ ఆర్కియాలజిస్ట్ శివకాంత్ బజ్ పాల్ ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa