గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో సాతులూరు పోలింగ్ కేంద్రాన్ని ఎస్పీ విశాల్ గున్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గుంటూరు రూరల్ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 4 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు నమ్మవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa