ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో టె​స్టులో లంచ్‌ విరామానికి ...4 వికెట్స్ కోల్పోయిన ఇంగ్లండ్‌

national |  Suryaa Desk  | Published : Sun, Feb 14, 2021, 12:02 PM

పిచ్‌ మాత్రం స్పిన్నర్లకు అనూకూలంగా ఉంది. బంతి స్పిన్నర్ల చేతుల్లో గింగిర్లు తిరుగుతోంది. ఈ ఉచ్చులో గోడ (పుజారా) కూడా పడిపోయినా... సారథి కోహ్లి ఖాతానే తెరువలేకపోయినా... ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఏటికి ఎదురీదే ఇన్నింగ్స్‌తో నిలబడ్డాడు. పిచ్‌పై స్పిన్నర్ల ఆధిపత్యం కొనసాగుతున్నా... తను మాత్రం వారి పాలిట సింహస్వప్నమయ్యాడు. చక్కని పోరాటంతో భారీ సెంచరీ సాధించాడు. రహానే అర్ధశతకంతో రోహిత్‌కు అండగా నిలిచాడు. బలమైన భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. దాంతో ఇంగ్లండ్‌తో శనివారం మొదలైన రెండో టెస్టులో తొలి రోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది.  స్పిన్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై భారత్‌ స్కోరు 400 పరుగులు దాటితే ఇంగ్లండ్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.


 టీమిండియాతో జరుగుతున్న రెండో టె​స్టులో లంచ్‌ విరామానికి ముందు ఇంగ్లండ్‌ డేనియల్‌ లారెన్స్‌ రూపంలో 4వ వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్‌ వేసిన 17వ ఓవర్‌ చివరి బంతిని లారెన్స్‌ ఫ్లిక్‌ చేయగా శుబ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు‌ 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులతో లంచ్‌ విరామానికి వెళ్లింది. బెన్‌ స్టోక్స్ 8 పరుగులతో క్రీజులో ఉన్నాడు.‌ స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత స్పిన్నర్లు చెలరేగిపోతున్నారు. ఇప్పటికే అశ్విన్‌ 2 వికెట్లతో ముందజలో ఉండగా.. అక్షర్‌, ఇషాంత్‌లు తలా ఒక వికెట్ తీశారు.‌ ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 290 పరుగులు వెనుకబడి ఉంది.


 


ఇంగ్లండ్‌ బిగ్‌ వికెట్‌ను కోల్పోయింది. తొలిటెస్టు హీరో కెప్టెన్‌ జో రూట్‌ 6 పరుగులు చేసి అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్‌ 23 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ వేసిన 7వ ఓవర్‌ రెండో బంతిని స్వీప్‌ షాట్‌ ఆడేందుకు సిబ్లీ ప్రయత్నించాడు. అయితే అశ్విన్‌ వేసిన బంతి బౌన్స్‌ అయి బ్యాట్‌ వెనుకవైపు తాకుతూ స్లిప్‌లో ఉన్న రోహిత్‌ చేతుల్లో పడింది. అయితే అంపైర్‌కు బంతి బ్యాట్‌కు తాకినట్లు కనిపించకపోవడంతో అవుట్‌ ఇవ్వలేదు. దీంతో కోహ్లి రివ్యూ కోరాడు. అయితే అప్పటికే తాను అవుటయ్యాయని భావించిన  సిబ్లీ పెవిలియన్‌వైపు నడవగా.. డీఆర్‌ఎస్‌ టీమిండియాకు అనుకూలంగా రావడంతో 16 పరుగులు చేసిన సిబ్లీ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఇంగ్లంఢ్‌ 9ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో రూట్‌ 4, లారెన్స్‌ 1 పరుగుతో ఉన్నారు.​‌ 


 


ఇంగ్లండ్ తన‌ తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది.ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇషాంత్‌ వేసిన బంతి లెగ్‌స్టంప్‌వైపు వెళుతున్నట్లు కనిపించడంతో బర్న్స్‌ అంపైర్‌ను రివ్యూ కోరాడు. అయితే డీఆర్‌ఎస్‌లో బంతి వికెట్లను తాకుతూ వెళ్లడం.. అంపైర్‌ నిర్ణయం సరైందేనని తేలడంతో ఇంగ్లండ్‌ ఒక రివ్యూను కోల్పోయింది. దీంతో బర్న్స్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ సున్నా పరుగుకే ఒక వికెట్‌ కోల్పోయింది.ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌ చివరి వికెట్‌గా మహ్మద్‌ సిరాజ్‌ వెనుదిరిగాడు. 300/6 క్రితం రోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కేవలం 29 పరుగులు మాత్రమే జోడించి ఇన్నింగ్స్‌ను ముగించింది. రిషబ్‌ పంత్‌ 58 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ నాలుగు వికెట్లతో రాణించగా.. ఓలీ స్టోన్‌ 3, జాక్‌ లీచ్‌ 2 వికెట్లు తీయగా.. కెప్టెన్‌ రూట్‌ ఒక వికెట్‌ తీశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa