ఓ వివాహేతర జంట ఆత్మహత్యకి పాల్పడిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కరూరు జిల్లా కలింగపట్టికి చెందిన కందస్వామి కుమార్తె శివభాగ్యం (22) తన భర్త సతీష్ తో విడాకులు తీసుకుని తన తండ్రి కందస్వామితో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలో ఆర్ముగం(36) అనే వివాహితుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి వారిని ఇరు కుటుంబాలు మందలించాయి. దీంతో మనస్తాపం చెందిన ఆర్ముగం, శివభాగ్యం బుధవారం రాత్రి ఓ తోటకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగారు. దీంతో శివభాగ్యం మృతిచెందింది. అనంతరం శివభాగ్యం దుపట్టాతో ఆర్ముగం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa