ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. వారి వేతన, ఉద్యోగ విరమణ ప్రయోజన బకాయిలన్నీ ఈ నెలాఖరులోపు చెల్లిస్తామని ప్రకటించింది. 2017–19 మధ్య కాలంలో రిటైరైన ఆర్టీసీ ఉద్యోగులకు గత ప్రభుత్వ హయాంలో వారి వేతనాలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు బకాయిలో ఉన్నాయి. ఆ మొత్తాలను చెల్లించాలని సీఎం జగన్ గతంలో అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు విడతల చెల్లింపులు జరపిన అధికారులు.. చివరి రెండు విడతల బకాయిలను కూడా ఏప్రిల్ చివరి నాటికి చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నాలుగేళ్లుగా బకాయిల కోసం ఎదురు చూస్తున్న 5,027 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa