Redmi Note 15 Pro Series ఇప్పుడు భారత మార్కెట్లో లాంచ్ అయ్యే తేదీని రెడ్మి అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో భాగంగా నోట్ 15 ప్రో మరియు నోట్ 15 ప్రో ప్లస్ మోడల్స్ వినియోగదారుల కోసం అందుబాటులోకి రానున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఇప్పటికే లాంచ్ అయిన ఈ సిరీస్ ఇప్పుడు భారత్‌లో కూడా లభించనుంది. రెడ్మి ప్రకారం, నోట్ 15 ప్రో సిరీస్ జనవరి 29 నుండి భారత మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అంచనాల ప్రకారం, ఈ ఫోన్ల ధర రూ.25,000 నుండి రూ.40,000 మధ్య ఉండవచ్చని తెలిపారు.రెడ్మి నోట్ 15 ప్రో 6.83 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లేను 120Hz రీఫ్రెష్ రేట్‌తో అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G200 అల్ట్రా చిప్సెట్తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. కెమెరా విభాగంలో 200MP ప్రైమరీ కెమెరా మరియు 8MP అల్ట్రావైడ్ సెన్సర్ ఉండవచ్చని టిప్‌స్టర్ పేర్కొన్నారు. అదే సమయంలో, నోట్ 15 ప్రో ప్లస్ 6.83 అంగుళాల CrystalRes 1.5K అమోలెడ్ డిస్ప్లేతో 120Hz రీఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఈ మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. రెడ్మి అధికారికంగా ఈ స్పెసిఫికేషన్లను ఇంకా ప్రకటించలేదు, కానీ త్వరలో పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.ఇక Redmi Note 15 5G ఫోన్ జనవరి తొలి వారంలో భారత్‌లో లాంచ్ అయింది. దీని ధరలు 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ – రూ.22,999 మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ – రూ.24,999. ఈ ఫోన్ IP65 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. 6.77 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను 120Hz రీఫ్రెష్ రేట్‌తో అందించే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 పై నడుస్తూ, 4 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్డేట్స్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ పొందగలదని రెడ్మి తెలిపింది.కెమెరా విభాగంలో ఈ ఫోన్లో 108MP ప్రైమరీ మరియు 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 20MP కెమెరా ఉంది, ఇది సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఉపయోగపడుతుంది. ఫోన్ 5520mAh బ్యాటరీతో పని చేస్తూ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 18W రివర్స్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa