బుధవారం వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ డుప్లెసిస్ (95*), రుతురాజ్ గైక్వాడ్ (64) చెలరేగడంతో చెన్నై భారీ స్కోరు చేసింది. అనంతరం 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆది నుండే తడబడింది. దీపక్ చాహర్ (4/29) ధాటికి గిల్ (0), రాణా (9), త్రిపాఠి (8), మోర్గాన్ (7), నరైన్ (4) పెవిలియన్ కు వరుస కట్టారు. కానీ అనంతరం రస్సెల్ (54), కమిన్స్ (66*), దినేష్ కార్తీక్ (40) పోరాడటంతో కోల్‌కతా 19.1 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశ నుంచి అద్భుతంగా పోరాడిన కోల్‌కతా ఒక దశలో అలవోకగా గెలిచేలా కనిపించింది. ఆఖర్లో కమిన్స్ కు సహకరించే వారు లేకపోవడంతో కోల్‌కతా ఓడిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa