ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలు గురించి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు.
ఫీజులు ఇలా ఉన్నాయి:
*నాన్ క్రిటికల్ కరోనా పేషేంట్ల వైద్యానికి రోజుకు రూ. 3,250.
*క్రిటికల్ కోవిడ్-19 పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే రోజుకి రూ. 5,480.
*ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే రోజుకి రూ. 5, 980.
*వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ. 9, 580.
*ఇన్ఫెక్షన్ ఉన్న వారికి వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రోజుకి రూ. 6,280.
*ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకి రూ. 10,380.
ఏపీ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోని ఆస్పత్రులన్ని ఇవే ఫీజులను వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 ఆసుపత్రులలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలలో కాని, ఫీజుల వసూళ్ళలో కాని ఇబ్బందులు ఉంటే ప్రజలు కోవిడ్-19 కాల్ సెంటర్ 104 లేదా స్పందన కాల్ సెంటర్ 1902 కి కాల్ చేసి తెలియజేయలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa