దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయికి చేరుకోవడంతో ప్రధాని కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పోరులో సైన్యం సాయంపై ప్రధాని నరేంద్ర మోడీ నేడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా పోరులో ఆర్మీ ముందుంటుందని సీడీఎస్ మోడీకి వివరించారు. గత రెండేళ్లలో రిటైర్డ్ అయిన ఆర్మీ మెడికల్ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకువస్తున్నట్లు సీడీఎస్ తెలిపారు. వారు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో వైద్య సేవలను అందిస్తారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa