గురువారం అర్థరాత్రి పంజాబ్‌లోని మోగా సమీపంలో మిగ్ -21 యుద్ధ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళ పైలట్ మృతి చెందాడు. IAF అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆ సమయంలో విమానం సాధారణ శిక్షణా విమానంగా ఉంది. ఈ ప్రమాదంలో పైలట్ అభినవ్ చౌదరి తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌ఫోర్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు అని పేర్కొంది. కాగా ఈ యుద్ధ విమానం ట్రైనింగ్ లో భాగంగా రాజస్థాన్‌లోని సూరత్‌గర్ నుండి హల్వారాకు వెళ్ళింది.. తిరిగి హల్వారా నుండి సూరత్‌గర్ వెళుతున్న సమయంలో మోగాలోని బాఘపురాన సమీపంలోని లాంగియానా గ్రామంలో కుప్పకూలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa