ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అండమాన్‌లో ప్రవేశించిన రుతుపవనాలు

national |  Suryaa Desk  | Published : Sat, May 22, 2021, 08:24 AM

 నైరుతి రుతుపవనాలు ఈ సారి ముందే పలకరిస్తున్నాయి. శుక్రవారం దక్షిణ అండమాన్‌ సముద్రంలో పూర్తిగా, దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌ సముద్రంలో పలు ప్రాంతాల్లో ప్రవేశించాయి. సాధారణంగా మే 22న రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రంలోకి వస్తాయి. ఈ ఏడాది ఒకరోజు ముందుగానే వచ్చాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వెల్లడించింది. త్వరలో కేరళ తీరాన్ని తాకే అవకాశముందని తెలిపింది. నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.ఈ సీజన్‌లో సాధారణం కంటే ఓ రోజు ముందుగా ఈ నెల 31న కేరళకు నైరుతి రుతుపవనాలు రానున్నట్టు ఇటీవల ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa