నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు జరిపిన వివిధ తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది.ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్ధానిక సీఐ వెంకటేశ్వర్లు రెడ్డి వాహనాల తనిఖీలు చేపట్టారు.నెల్లూరు నుండి చెన్నైకి వెళ్లే కావలి డిపోకు చెందిన AP26 Z 0315 బస్సులో ఓ బ్యాగులో ఆరు కేజీల గంజాయిని గుర్తించారు. పోలీసులు తనిఖీలు చేస్తుండటం చూసిన వ్యక్తులు, గంజాయి సంచులను బస్సులోనే వదిలి పరారయ్యారు. వారి కోసం సీఐ తన సిబ్బందితో పట్టణం మొత్తం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆ ఇద్దరు వ్యక్తులు ఆచూకీ లభ్యం కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa