ఒంగోలు: ‘జెంటిల్‌మెన్’ ఫేమ్ సురభి ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్ర ఒంగోలులో సందడి చేశారు. నగరంలోని బస్టాండ్ కూడలి వద్ద ఓ సెల్‌ఫోన్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. సురభిని చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలిరావడంతో ఆ ప్రాంతమంగా సందడిగా మారింది. సురభిని చరవాణుల్లో బంధించేందుకు పోటీ పడ్డారు.
ఈ సందర్భంగా సురభి మాట్లాడుతూ.. ఒంగోలు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు సరసన ఓటర్, అల్లు శిరీష్‌తో బీ57 సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa