కోలీవుడ్ నటుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, తమిళ నిర్మాతల సంక్షేమ సంఘం అధ్యక్షుడు విశాల్ సోదరి ఐశ్వర్య వివాహం ఈ రోజు ఎంఆర్‌సీ మండపంలో క్రితీష్‌తో గ్రాండ్‌గా జరిగింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకకి హాజరై వధూ వరులను ఆశీర్వదించారు. అంతకు ముందు రోజు మెహందీ మరియు సంగీత్ వేడుకలని గ్రాండ్‌గా నిర్వహించినట్టు తెలుస్తుంది. విశాల్ ప్రస్తుతం తుప్పరివాలన్ అనే చిత్రం చేస్తున్నాడు. మిస్కీన్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. మరో వైపు విలన్ అనే చిత్రంలోను కీలక పాత్ర చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa