నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల ఫలితాల్లో తెదేపా జోరు కొనసాగిస్తోంది. తొలి రౌండు నుంచి అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డిపై వరుస 15 రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యతను సొంతం చేసుకున్నారు. పదిహేనో రౌండ్ పూర్తయ్యే సరికి 26,262 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నెల 24న జరిగిన ఈ ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైన విషయం తెలిసిందే.
రౌండ్ల వారీగా
రౌండు తెదేపా వైకాపా ఆధిక్యం
1 5,477 4,279 1,198
2 5,162 3,400 1,762
3 6,640 3,553 3,087
4 6,465 2,859 3,606
5 6,975 3,563 3,412
6 6,161 2,828 3,332
7 4,859 4,312 547
8 4,436 4,088 348
9 4,309 3,430 879
10 4,642 3,156 1,486
11 4,226 3,622 604
12 5,629 4,359 1,270
13 5,690 4,235 1,455
14 5,172 4,125 987
15 6,049 3,760 2,289
మొత్తం ఆధిక్యం 26,262
తెదేపాకు వచ్చిన మొత్తం ఓట్లు: 81,892
వైకాపాకు వచ్చిన మొత్తం ఓట్లు : 55,630
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa