భారతదేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ కు సంబంధించిన ఆసక్తికర అంశం దేశ ప్రజలను ఆలోచింప చేస్తోంది. త్రివిధ దళాల(వాయుసే, ఆర్మీ, నౌకాదళం) తొలి అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా బిపిన్ రావత్ చరిత్రకెక్కారు. అంతకు ముందు ఈ పోస్టు లేనే లేదు. కానీ పాకిస్తాన్, చైనా దేశాలతో యుద్ధ వాతావరణం ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోడి ఈ పోస్టును క్రియేట్ చేశారు. యుద్ధ సమయంలో వాయుసే, ఆర్మీ, నౌకాదళాల మధ్య సమన్వయం ఉండేలా ఈ పోస్టును రూపొందించి ఇందుకు అధిపతిగా బిపిన్ రావత్ ను నియమించడం అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అంతకు ముందు ఆర్మీ చీఫ్ గా పని చేసిన బిపిన్ రావత్ ను ప్రధాని మోడి ఏరి కోరి ఈ పోస్టుకు సెలెక్ట్ చేసినట్లుగా చెప్పుకుంటారు. త్రివిధ దళాల విషయంలో ప్రస్తుతం ఆయన ర్యాంకు దాదాపుగా రాష్ట్రపతి తర్వాత ఆయనదే. ఇంతటి ముఖ్యమైన ర్యాంక్ కలిగిన వ్యక్తి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇలా ప్రమాదానికి గురి కావడం పట్ల అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa