ఒకే వ్యక్తి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే రీవెరిఫికేషన్ తప్పనిసరి అని టెలీకమ్యూనికేషన్ల శాఖ (డాట్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులు ఏ నెంబర్ ను ఉపయోగించాలని భావిస్తున్నారో దాన్ని గుర్తించి, మిగతా వాటిని డీ యాక్టీవ్ చేసుకోవాలని సూచించింది. రీ వెరిఫికేషన్ చేయని అదనపు మొబైల్ కనెక్షన్లు డిసెంబర్ 7 నుంచి 60 రోజుల్లో రద్దు అవుతాయని స్పష్టం చేసింది. ఖాతాదారులు విదేశీ పర్యటనలో ఉన్న లేదా ఆస్పత్రిలో ఉన్నా మరో 30 రోజులు అదనపు సమయం కేటాయించనున్నారు. సైబర్ క్రైమ్ కట్టడిలో భాగంగా డాట్ ఈ చర్యలకు పూనుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa