కృష్ణానదిలో ప్రమాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐదుగురు వేద పాఠశాల విద్యార్దులు, ఒక గురువు మృతిచెందిన ఘటన గుంటూరు జిల్లాలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం బాధాకరమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జీజీహెచ్‌లో విద్యార్థుల మృతదేహాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్నానానికి దిగిన సమయంలో నీటిలో పడిపోయిన ఒక విద్యార్దిని కాపాడే ప్రయత్నంలో ఘటన జరిగిందన్నారు. శృంగేరి పీఠం అధికారులతో మాట్లాడానని చెప్పిన మంత్రి ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa