ఇటీవల అకాల మరణం చెందిన ఎమ్మెల్సీ కరీమున్నీసా కుమారుడు మహ్మద్ రుహుల్లాకు వైసీపీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వెల్లడించారు. రుహుల్లా కుటుంబసభ్యులను పిలిపించుకుని సీఎం మాట్లాడినట్లు వెల్లంపల్లి చెప్పారు. ప్రస్తుతం మహ్మద్ రుహుల్లా వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa