ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో మరో 8 ఒమిక్రాన్ కేసులు.. 49 కి చేరిన సంఖ్య

national |  Suryaa Desk  | Published : Tue, Dec 14, 2021, 02:51 PM

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో 8 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీలో 4, రాజస్థాన్ లో మరో 4 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 49 కి చేరుకుంది. డిసెంబర్ 2న కర్ణాటకలో తొలుత ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు. ఈ 12 రోజుల వ్యవధిలో ఆ వేరియంట్ పలు రాష్ట్రాలకు వ్యాపించింది. ఈ కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో ఆయా రాష్ట్రాలు టెన్షన్ పడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa